జీరో టాలరెన్స్‌ విధానాన్ని అనుసరిస్తున్నాం !

Telugu Lo Computer
0


నకిలీ మందులపై జీరో టాలరెన్స్‌ విధానాన్ని అనుసరిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ తెలిపారు. భారత్‌లో తయారైన పలు దగ్గు సిరప్‌ల కారణంగా మరణాలు సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో 71 కంపెనీలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో 18 కంపెనీలను మూసివేయాలని ఆదేశించినట్లు చెప్పారు. దేశంలో నాణ్యమైన ఔషధాల ఉత్పత్తిని నిర్ధారించడానికి కాంప్రహెన్సివ్‌ రిస్క్‌ బేస్డ్‌ విశేష్ల నిరంతరం జరుగుతుందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. నకిలీ మందుల కారణంగా ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా ప్రభుత్వంతో పాటు సంబంధిత నియంత్రణ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రపంచానికే నాణ్యమైన ఫార్మాసిటీ భారత్‌ అన్నారు. గతేడాది గాంబియాలో 66 మంది చిన్నారులు, ఉబ్జెకిస్థాన్‌లో 18 మంది చిన్నారులు భారత్‌లో తయారైన దగ్గు సిరప్‌ కారణమని ఆరోపణలు వచ్చాయి. ఇదిలా ఉండగా.. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా జెనరిక్‌ ఔషధాలకు అతిపెద్ద సరఫరాదారు. ప్రపంచ డిమాండ్‌లో 50శాతానికిపైగా టీకాలను భారత్‌ సరస్స్తున్నది. అంతే కాకుండా అమెరికాలో 40శాతం, యూకేకు 20శాతం అదనంగా మెడిసిన్స్‌ను సరఫరా చేస్తున్నది. అయితే, గాంబియాలో పిల్లలు మరణించగా.. వారి మృతికి భారత్‌కు చెందిన ఓ కంపెనీ దగ్గు మందు సిరప్‌ కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో తెలిపింది. అయితే, వాస్తవికతపై లేఖ రాశామని, దీనికి బదులురాలేదని ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. ఓ కంపెనీకి చెందిన శాంపిల్స్‌ను పరిశీలించామని, మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా చిన్నారికి డయేరియా సోకినట్లు గుర్తించామన్నారు. డయేరియా ఉన్న పిల్లలకు దగ్గు మందు సిరప్‌ ఎవరు సిఫారసు చేశారు? అని ప్రశ్నించారు. 24 శాంపిల్స్ తీసుకోగా.. అందులో నాలుగు ఫెయిల్ అయ్యాయని మంత్రి వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)