బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా వాసుదేవ్‌పూర్ సరాయ్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల వివాహిత అదే గ్రామానికి చెందిన మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే ఈ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి, అతడిని అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకుంది. శనివారం రాత్రి సెల్ఫీ తీసుకుందాం అంటూ భర్తను ఓ చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళింది. అక్కడ అతన్ని మాటల్లో పెట్టి ఉన్నట్టుండి ఓ తాడుతో చెట్టుకు కట్టేసింది. అతడు అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కింది. ఆ తర్వాత కిరోసిన్ తీసుకొచ్చి భర్తపై చల్లి నిప్పు పెట్టింది. మంటలు చెలరేగి పొగరావడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పారు. ఆ తర్వాత బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని భర్తను చంపేందుకు ప్రయత్నించిన మహిళను అరెస్టు చేశారు. కాగా మంటల్లో గాయపడిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
భర్తను చెట్టుకు కట్టేసి నిప్పు పెట్టిన భార్య
June 13, 2023
0
Tags