ట్రక్కు డ్రైవర్ సంపాదన నెలకు 8 లక్షలు !

Telugu Lo Computer
0


అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ మరోసారి ట్రక్కులో ప్రయాణించారు. ఈ క్రమంలో వాషింగ్టన్​ నుంచి న్యూయార్క్​ వరకు స్థానికంగా ట్రక్కు నడుపుకుంటున్న తల్జీందర్​ సింగ్​ అనే వ్యక్తి వాహనంలో వెళ్లారు. ట్రక్కు డ్రైవర్లు ఎలా పని చేస్తారు ? ట్రక్కు ఫీచర్లు ఏమిటి ? వారికి చలాన్లు పడతాయా ? ఎంత వేగంతో ప్రయాణించాలి ? డ్రైవర్లు ఎంత సంపాదిస్తారు ? వంటి విషయాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అక్కడ డ్రైవర్లు నెలకు రూ.8 లక్షలు సంపాదిస్తారని అతడు చెప్పడంతో ఆశ్చర్యపోయారు. ఈ సమయంలో పంజాబీ గాయకుడు దివంగత సిద్ధూ మూసేవాల '295'పాటను అడిగి మరీ ప్లే చేయించుకొని విన్నారు. అనంతరం ఓ రెస్టారెంట్​కి వెళ్లి అక్కడి వారిని పలకరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)