ఉత్తరప్రదేశ్‌ లో 5 ఏళ్ల ట్రాఫిక్ చలాన్లు రద్దు !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌ లోని అన్నీ జిల్లాలలో 5 ఏళ్లలో నమోదైన ట్రాఫిక్ చలాన్లను రద్దు చేస్తున్నట్లు యోగి ఆదిత్యనాథ్ సర్కార్   ప్రకటించింది. ఈ మేరకు జీవో కూడా విడుదల కావడం విశేషం. అయితే.. ఈ 5 ఏళ్ళకి ఓ నిర్దిష్ట కాలాన్ని ప్రకటించారు. 2017 జనవరి 1 నుంచి 2021 డిసెంబరు 31 వరకు ఏ వాహనాలపై చలాన్లు పెండింగ్ ఉన్నాయో, అవన్నీ రద్దు కానున్నాయి. ఈ కాలంలో చలాన్లు నమోదై.. కోర్టులో కేసులు ఉన్న వాహనాలపై కూడా చలాన్లు రద్దు కానున్నాయి. ఈ మేరకు యూపీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ చంద్ర భూషణ్ సింగ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కోర్టుల నుంచి కేసుల జాబితా రాగానే పోర్టల్ నుండి చలాన్లు తొలగించనున్నారు. యోగీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా కమర్షియల్ వాహనదారులకు ఎక్కువ లాభం కలగనుంది. ఈ క్రమంలో వాహనంపై ఉన్న చలాన్లు అన్నీ రద్దు అయ్యాక, ఆ వాహనదారుల ఫోన్ నంబర్స్ కి మెసేజ్ రానుంది. ఇటీవల నోయిడాలోని రైతులు అంతా ట్రాఫిక్ చలాన్లు రద్దు చేయాలని రోడ్లపైకి రావడంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)