అమ్మఒడి నిధులను ఈ నెల 28న ముఖ్యమంత్రి జగన్ విడుదల చేయనున్నారు. అందులో భాగంగా అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లో ఈ నిధులు జమ కానున్నాయి. ఈ నెల 22న లబ్ధిదారుల జాబితా ప్రకటించనున్నారు. విద్యార్ధులకు 75 శాతం హాజరుతో పాటుగా ప్రభుత్వం నిర్దేశించిన నిబందనలకు అనుగుణంగా ఎంపికైన 43,96,402 మంది తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నిధులు జమకానున్నాయి. అమ్మఒడి మార్గదర్శకాలు జారీ:అమ్మఒడి పథకం నిధుల విడుదల పైన ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. 22022-23 సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో సీఎం జగన్ నగదు జమ చేయనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం విద్యార్ధులకు 75 శాతం హాజరు తప్పనిసరి నిబంధన అమలు చేస్తోంది. ఇప్పటి వరకూ జగన్ ప్రభుత్వం మూడుసార్లు అమ్మఒడి నగదు ఇచ్చింది. ఇప్పుడు ఇవ్వబోయేది నాలుగో విడత. ఆన్ లైన్ లో ఉంచటంతో పాటుగా స్థానిక సచివాలయాల్లోనూ లబ్దిదారుల జాబితా అందుబాటులో ఉంచనున్నారు. అమ్మఒడి పథకం కింద మూడేళ్ల కాలంలో ఏపీ ప్రభుత్వం రూ.19,617 కోట్లు అందించింది. అమ్మఒడి పథకంలో తొలి ఏడాది తల్లులకు రూ.15 వేలు జమ చేసారు. గత ఏడాది నుంచి అమ్మఒడి కింద ఇచ్చే రూ 15 వేల నుంచి పాఠశాల..టాయిలెట్ల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ 2వేలు మినహాయిస్తోంది.
28న అమ్మఒడి నిధులు విడుదల
June 17, 2023
0
Tags