ఆగస్టు 15 నుంచి అన్ని పంచాయతీల్లోనూ యూపీఐ పేమెంట్స్ !

Telugu Lo Computer
0


గస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నుంచి దేశ వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లోనూ యూపీఐ చెల్లింపులు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి అన్ని పంచాయతీల్లో యూపీఐ సేవలు ప్రారంభించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వశాఖ జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది. అన్ని అభివృద్ధి, ఆదాయ సేకరణ కోసం తప్పనిసరిగా డిజిటల్ చెల్లింపులను చేసేలా పంచాయతీల్లో యూపీఐ సేవలను ప్రారంభించాలని పేర్కొంది. ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వంటి ప్రముఖుల సమక్షంలో రాష్ట్రాలు పంచాయతీల్లో యూపీఐ సేవలను ప్రారంభించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో స్పష్టం చేసింది. దేశంలో 98 శాతం పంచాయతీలు ఇప్పటికే యూపీఐ ఆధారిత చెల్లింపులను ఉపయోగించడం ప్రారంభించాయని పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ కార్యదర్శి సునీల్ కుమార్ తెలిపారు. పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టం(పీఎంఎఫ్ఎస్) ద్వారా దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల విలువైన చెల్లింపులు జరిగాయన్నారు. ఇకపై పంచాయతీలు డిజిటల్‌గా చెల్లింపులు జరగనున్నాయి. చెక్కులు, నగదు చెల్లింపులు దాదాపు ఆగిపోయాయని తెలిపారు. జూన్ 30న సర్వీస్ ప్రొవైడర్లు, వెండర్స్‌తో సమావేశాలు నిర్వహించాలని పంచాయతీలను మంత్రిత్వ శాఖ కోరింది. యూపీఐ ప్లాట్‌ఫాంలు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భీమ్, వాట్సాప్ పే, అమెజాన్ పే, భారత్ పేలకు సంబంధించిన సంబంధిత వ్యక్తుల వివరాలను మంత్రిత్వ శాఖ పంచుకుంది. 

జులై 15 నాటికి మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం పంచాయతీలు తగిన సర్వీస్ ప్రొవైడర్లను ఎంపిక చేసుకోవాలని, జులై 30 లోపు వెండర్లను ఖరారు చేయాలని సూచించింది. అధికారులకు జిల్లా, బ్లాక్ స్థాయిల్లో శిక్షణ శిబిరాలను నిర్వహించాలను తెలిపింది. డిజిటల్ లావాదేవీలను ప్రారంభించడం వల్ల అవినీతిని అరికట్టవచ్చని పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ స్పష్టం చేశారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)