జూన్ 12 నుంచి స్కూల్స్ పునఃప్రారంభం !

Telugu Lo Computer
0


తెలంగాణలో జూన్ 12 నుంచి స్కూల్స్ పునఃప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా హై స్కూల్స్ ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.45 వరకు నిర్వహించనున్నారు. జంట నగరాల్లో ఉన్నత పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 8.45 నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి. జంట నగరాలు మినహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉదయం 9 గంటల నుండి 4.15 నిమిషాల వరకు నడవనున్నాయి. ప్రతి నెల నాలుగో శనివారం నో స్కూల్ బ్యాగ్ డే నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలకు టెక్స్ట్ బుక్స్ చేరుకున్నాయి. త్వరలో విద్యార్థులకు యూనిఫాం అందజేస్తామని విద్యా శాఖ అధికారులు అంటున్నారు. అలాగే, ఈ ఏడాది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నోట్ బుక్స్ కూడా అందించనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)