ఉద్ధవ్ థాక్రే తో నితీశ్ కుమార్‌ భేటీ

Telugu Lo Computer
0


బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ ఈరోజు శివసేన నేత ఉద్దవ్ థాక్రేతో భేటీ అయ్యారు. ముంబయిలో ఆ ఇద్దరూ కలుసుకున్నారు. అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం దేశం కోసం పనిచేయడం లేదని నితీశ్ ఆరోపించారు. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కలిసి కట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీల నేతలతో కలిసేందుకు నితీశ్ కుమార్ దేశవ్యాప్తంగా టూర్ చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే లోక్‌సభ ఎన్నికలను టార్గెట్ చేసిన నితీశ్‌.. బుధవారం రోజున రాంచీలో ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్‌ను కలిశారు. రెండు రోజుల క్రితం భువనేశ్వర్‌లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ను కూడా నితీశ్ కుమార్ కలిశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)