కడుపునొప్పని ఆస్పత్రికి వెళితే కిడ్నీలు, గర్భాశయాన్ని మాయం చేశారు !

Telugu Lo Computer
0


బీహార్ లోని ముజఫర్‌పూర్‌లోమధురాపూర్‌కు చెందిన సునీతాదేవి కడుపునొప్పి కారణంగా స్థానిక శుభకాంత్ క్లినిక్‌కి వెళ్లింది. కానీ తాను డాక్టర్ అని చెప్పుకోని పవన్ కుమార్ అనే కాంపౌండర్ క్లినిక్ నడుపుతున్నాడు. పవన్ కుమార్ తన భార్య జితేంద్ర కుమార్ పాశ్వాన్, ఆర్కే సింగ్‌తో కలిసి ఆ మహిళకు రెండున్నర గంటల పాటు ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ కోసం 20 వేలు వసూలు చేశారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా సునీతాదేవి శరీరం నుంచి గర్భాశయం, 2 కిడ్నీలు తీసుకున్నారు. అవయవాలను దొంగిలించిన అనంతరం బాధితురాలి ఆరోగ్యం క్షీణించింది. ఆమెను పాట్నాలోని మరో ఆసుపత్రికి తరలించగా వారంతా అక్కడి నుంచి పరారయ్యారు. ఆ ఆసుపత్రిలో మరో రూ.40 వేలు ఖర్చయ్యాయి. అనంతరం సునీతాదేవిని పాట్నా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి స్కానింగ్ చేశారు. ఈ స్కానింగ్‌ని చూసి ఆస్పత్రి వైద్యులు షాక్‌కు గురయ్యారు. సునీతాదేవి రెండు కిడ్నీలు, గర్భాశయం వారికి కనిపించలేదు. షాక్ నుంచి తేరుకున్న వైద్యులు ఆమె రెండు కిడ్నీలు, గర్భాశయం చోరీకి గురైనట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సెప్టెంబర్ 2022 నుండి సునీతా దేవి హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. ఆమె ప్రభుత్వ సహాయంతో డయాలసిస్ చేయించుకుంటుంది. ఈ ఘటనతో ఆమె వెంట ఉండాల్సిన భర్త దూరమయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కిడ్నీలు అపహరించిన దొంగలను అరెస్టు చేశారు. కానీ నిందితులు ఆ కిడ్నీలను విక్రయించలేదని తెలిపారు. వాటిని సరిగా దాచి ఉంచకపోవడంతో కుళ్లిపోయినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న బాధితురాలు నిందితుడు పవన్‌ కుమార్‌ కిడ్నీని తనకు ఇప్పించి తన ప్రాణాలు కాపాడాలని కోరుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)