తమిళనాడులోని కోయంబత్తూర్ కు చెందిన కౌసల్య నిన్న మార్నింగ్ వాక్‌కు వెళ్లింది. ఈ క్రమంలో ఓ వైట్ కారులో ఇద్దరు దుండుగులు ఆమెను ఫాలో అయ్యారు. ప్యాసింజర్ సీటులో కూర్చున్న ఓ వ్యక్తి ఆమె చైన్ ను పట్టుకున్నాడు. వెంటనే అప్రత్తమైన ఆ మహిళ తన చైన్ ను గట్టిగా పట్టుకుంది. దీంతో మరో వ్యక్తి కారు స్పీడ్ పెంచడంతో కొన్ని మీటర్ల మేర కారుతో పాటు ఆ మహిళను ఈడ్చుకెళ్లారు. అయినప్పటికీ ఆ మహిళ చైను గట్టిగా పట్టుకోవడంతో స్నాచర్లు అక్కడ్నుంచి జారుకున్నాడు. ఈ ఘటనలో మహిళకు స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడంతో సీసీ కెమెరాల అధారంగా నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. .
గొలుసు కోసం మహిళను ఈడ్చుకెళ్లిన చైన్ స్నాచర్లు
May 16, 2023
0
Tags