కర్ణాటక లోని కలబుర్గిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బహిరంగ సభలో ప్రసంగిస్తూ మోడీని విష పాముతో పోల్చుతూ వ్యాఖ్యలు చేశారు. మోడీ విషపాము అని విషం ఉందా లేదా అని నాకి చూస్తే చచ్చి ఊరుకుంటారని ఖర్గే అన్నారు. అయితే తన వ్యాఖ్యలు మోడీపై కాదని, బీజేపీపై అని ఖర్గే వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఖర్గే మనసులో విషం ఉందని అందుకే ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై విమర్శించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఖర్గే వ్యాఖ్యలను తప్పుబట్టారు. కాంగ్రెస్ పెద్దల మెప్పుకోసం ఖర్గే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు గతంలో కూడా మోడీని వ్యక్తిగతంగా విమర్శించి దెబ్బ తిన్నారు. మోడీని మౌత్ కా సౌదాగర్ (మృత్యు వ్యాపారి) అని స్వయంగా సోనియా అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గరకు వచ్చి చాయ్ అమ్ముకోమని మణిశంకర్ అయ్యర్ గతంలో విమర్శించారు.
పాముకు విషం ఉందా లేదా అని నాకి చూస్తే చచ్చి ఊరుకుంటారు !
April 27, 2023
0
Tags