ఒడిశాలోని కేంద్రపరా జిల్లాకు చెందిన 32 ఏళ్ల మహిళ సైబర్ నేరగాళ్ల చేతిలో డబ్బులు పోగొట్టుకుంది. గుజరాత్‌లో ఉన్న తన భర్త ఈ విషయం తెలుసుకుని ఏప్రిల్ 1న తనకు మూడుసార్లు తలాక్ చెప్పినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు చట్ట విరుద్ధంగా విడాకులు ఇచ్చారని వాపోయింది. ఆ దంపతులకు పెళ్లై 15 ఏళ్లు, పైగా ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. దీంతో పోలీసులు సదరు వ్యక్తిపై వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు.
సైబర్ నేరగాళ్ల చేతిలో డబ్బులు పోగొట్టుకున్నందుకు తలాక్ చెప్పిన భర్త !
April 09, 2023
0
Tags