తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. మరికొన్ని రోజులు టెంపరేచర్లు ఇదే స్థా యిలో ఉంటాయని హెచ్చరిస్తున్న వాతావరణ శాఖ.. పలు చోట్ల రానున్న నాలుగు రోజులపాటు వానలు పడ్తాయని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదవుతుందని విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆ తర్వాతి మూడు రోజులు దాదాపు అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు పడొచ్చని పేర్కొంది.
నాలుగు రోజుల పాటు వర్షాలు
April 19, 2023
0
Tags