తెలుగులో అవకాశాలు వచ్చినా ఎక్కువ చేయలేకపోయాను !

Telugu Lo Computer
0


ఖుష్బూ అత్యంత ఎక్కువ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్. అప్పట్లోనే ఆమెకు తమిళనాడులో గుడి కట్టారంటే అర్థం చేసుకోవచ్చు ఆమె అందానికి ఎంతగా ఆరాధించేవారో. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‏గా కొనసాగిన ఖుష్బూ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‏లో సహయ నటిగా మెప్పిస్తున్నారు. ప్రస్తుతం గోపిచంద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రామబాణం లో ఆమె కీలకపాత్రలో నటించారు. ఈ మూవీ వచ్చే నెల 5న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఖుష్బూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తెలుగు తోనే తన సినీ ప్రయాణం మొదలైందన్నారు. వెంకటేష్ సూచనతోనే ఆయన తొలి చిత్రం కలియుగ పాండవుల కోసం తనను ఎంపిక చేశారని తెలిపారు. “ఓ హిందీ చిత్రం చూసి నన్ను సెలక్ట్ చేయమని వెంకీ చెప్పారట. అది నా అదృష్టం. కె. రాఘవేంద్రరావు, జంధ్యాల, భారతిరాజా, బాలచందర్ ఇలా గొప్ప దర్శకులతో పనిచేసే అవకాశం కలిగింది. నేను మద్రాసులో ఉన్న సమయంలో తెలుగు నుంచి ఎక్కువగానే అవకాశాలు వచ్చినా చేయలేకపోయాను. అలా చంటి ను కూడా వదిలేసుకోవాల్సి వచ్చింది. నేను చిరంజీవి, బాలకృష్ణలకు జోడిగా నటించలేదు. అవకాశం వస్తే వాళ్లతో కలిసి నటించాలని ఉంది. అమితాబ్ బచ్చన్ తోనూ కలిసి నటించాలని ఉండేది. బాలనటిగా ఆయనతో కలిసి నటించాను. నా అభిమాన నటుడు ఆయన ఫోటోస్ ఇప్పటికీ నా బెడ్ రూమ్ లో ఉంటాయి. చీనీకమ్ చిత్రంలో ఆయనతో కలిసి టబు నటించడాన్ని చూసి చాలా అసూయగా అనిపించింది. ఇదే విషయాన్ని టబుకు ఫోన్ చేసి నా అసూయనంత వెళ్లగక్కాను ” అంటూ చెప్పుకొచ్చారు ఖుష్బూ.

Post a Comment

0Comments

Post a Comment (0)