ఏక్‌నాథ్ షిండే కు పదవీ గండం ?

Telugu Lo Computer
0


మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి ఏక్‌నాథ్ షిండే  త్వరలోనే తొలగనున్నట్లు తెలిసింది. ఆయన వారసుడిగా ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ పగ్గాలు చేపట్టనున్నారు. బీజేపీతో ఎన్సీపీకి ఉన్న పొత్తులో భాగంగా అజిత్ పవార్‌కి ఈ ఛాన్స్ దక్కుతోంది. సుప్రీంకోర్టు ఫిరాయింపు తీర్పు ప్రకారం ఏక్‌నాథ్ షిండే తలపై పార్టీ ఫిరాయింపు కత్తి వేలాడుతూ ఉంది. అందువల్ల ఏ క్షణంలోనైనా షిండే ఆ పదవి నుంచి తొలగక తప్పదు. తద్వారా.. సీఎం సీటు దక్కించుకోవాలనుకున్న అజిత్ పవార్ కల నిజం కాబోతోంది. ఆయనకు ఎన్సీపీ లో 35-40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అజిత్ పవార్‌కి లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తున్నా.. పార్టీ వృద్ధ నేత శరద్ పవార్ ఆశీర్వాదం పొందాలని మద్దతు ఎమ్మెల్యేలు సూచిస్తున్నారు. 2019లో బీజేపీతో ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలి అనుకున్నప్పుడు.. 80 గంటలపాటూ.. తర్జనభర్జన నడిచింది. అందుకు కారణం శరద్ పవారే. ఆయనకు ఈ పొత్తు నచ్చలేదు. కాషాయ పార్టీతో చేతులు కలిపితే.. తన పొలిటికల్ కెరీర్‌కి బ్రేక్ పడినట్లే అవుతుందన్న శరద్ పవార్.. దీనిపై నువ్వే సొంత నిర్ణయం తీసుకో అని అజిత్ పవార్‌కి 2019లో సూచించారు. అజిత్ మద్దతుదారులు సైతం అప్పట్లో.. శరద్ పవార్ మాట వినాలని కోరారు. ప్రజల మూడ్ ఎలా ఉంటుందో.. ఆయనకు బాగా తెలుసని అన్నారు. అయినప్పటికీ అజిత్ పవార్ పార్టీని బీజేపీతో కలిపారు. రెండు పార్టీలూ కలిసి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పటి నుంచి శరద్ పవార్ యాక్టివ్ పాలిటిక్స్‌కి దూరంగానే ఉన్నారు. అందుకే ఇప్పుడు ఆయన ఆశీర్వచనాలు తీసుకోవాలని అజిత్ మద్దతుదారులు కోరుతున్నారు. ఏప్రిల్ 8న అజిత్ పవార్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిశారు. ఆ సమయంలో పార్టీ నేతలు ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కారే కూడా అజిత్ వెంట ఉన్నారు. మంత్రి పదవుల పంపకాలను డిసైడ్ చేసేందుకే వారు వెళ్లారని తెలుస్తోంది. బీజేపీ వైపు నుంచి ఏక్‌నాథ్ షిండేను తొలగించేందుకు సిద్ధంగానే ఉన్నట్లు తెలిసింది. 2023 ఫిబ్రవరి 18 నుంచి శివసేన అధ్యక్షుడిగా ఉన్న ఏక్‌నాథ్ షిండేకి ప్రస్తుతం మహారాష్ట్రలో అనుకూల పరిస్థితులు లేవు. ఏక్‌నాథ్ షిండే వల్ల... ఉద్ధవ్ థాక్రే, ఆయన కొడుకు ఆదిత్య థాక్రే... ఆమధ్య శివసేన పార్టీ పేరు, గుర్తును కోల్పోయారు. దీని వల్ల వారికి రాష్ట్రంలో పాపులార్టీ బాగా పెరిగింది. బీజేపీ అంతర్గత సర్వే ప్రకారం.. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీకి.. రాష్ట్రంలోని 48 లోక్ సభ స్థానాల్లో 33 దాకా వస్తాయనే అంచనా ఉంది. మహారాష్ట్రను కోల్పోయేందుకు బీజేపీ హైకమాండ్ ఏమాత్రం సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో.. షిండే ఉండటం కంటే... మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మరాఠా వ్యక్తి ఉంటే.. బాగుంటుందని బీజేపీ భావిస్తోంది. రాష్ట్రంలో 35 శాతం మంది జనాభా మరాఠాలే. అందుకే.. మహారాష్ట్ర 21వ ముఖ్యమంత్రిగా అజిత్ పవార్‌కి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఈమధ్య శరద్ పవార్.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఢిల్లీలో కలిశారు. ఆ సమయంలో శరద్ పవార్ వెంట ప్రఫుల్ పటేల్ లేరు. తద్వారా.. బీజేపీతో ఎన్సీపీ చేతులు కలపడం వెనక ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కారే ఉండి ఉండొచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)