తొలిసారిగా ఓ మహిళ విజయవాడ నగర బహిష్కరణ !

Telugu Lo Computer
0


విజయవాడకు చెందిన సారమ్మ అలియాస్‌ శారద పోలీసుల కళ్లుగప్పి దందాలు చేయడంలో దిట్ట. ఇప్పటికే సారమ్మపై అజిత్‌సింగ్‌ నగర్‌ పీఎస్‌లో 13 కేసులున్నాయి. గంజాయి అమ్మడం మొదలు చాలా వివాదాల్లో ఈమె ప్రమేయం ఉంది. ఎన్నిసార్లు హెచ్చరించినా, కేసులు పెట్టినా తీరు మారకపోవడంతో చివరికి విజయవాడ నగర బహిష్కరణే మార్గమని భావించిన పోలీసులు అదే నిర్ణయాన్ని అమలు చేశారు. ఈమెతోపాటు 19 మందిని సిటీ నుంచి బహిష్కరించారు. ఇటీవల వరుసగా వెలుగు చూస్తున్న గంజాయి కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు ఈ నగర బహిష్కరణ అస్త్రాన్ని బయటకు తీశారు. మరోసారి వీళ్లు గంజాయి కేసుల్లో దొరికితే కఠిన చర్యలు ఉంటాయని సీపీ క్రాంతి రాణా టాటా వార్నింగ్‌ ఇచ్చారు. నగర బహిష్కరణకు గురైన వారిలో సారమ్మ అనే మహిళ ఉండడం, తొలిసారిగా ఓ మహిళపై సీరియస్‌ యాక్షన్‌ ఉండడం చర్చనీయాంశమైంది.

Post a Comment

0Comments

Post a Comment (0)