ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లోని రిటైర్డ్ బ్యాంక్ అధికారి నుండి మోసానికి సంబంధించిన విచిత్రమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పదవీ విరమణకు ముందే విడాకులు తీసుకున్నాడు. అతను సింగిల్ ఉంటు, మనోవేదనకు గురౌతున్నాడు. దీంతో సోషల్ మీడియాల్లో, మ్యాట్రిమోనియల్ సైట్లలో తగిన మ్యాచ్ కోసం చూస్తుండేవాడు. ఈ క్రమంలో అతని కంటే 20 ఏళ్లు చిన్నదైన ఒక మహిళ అతనితో పరిచయం ఏర్పడింది. మొదటి సారిగా చాటింగ్ లోనే అతను ఆమెతో ప్రేమలో పడ్డాడు. దీంతో వారి పరిచయం, కాస్త పెళ్లి వరకు చేరింది. అవతలి వైపు యువతి కూడా తనకు 43 ఏళ్లని చెప్పింది. తనకు డైవర్స్ అయ్యాయని చెప్పుకుంది. దీంతో ఇద్దరు ఒక్కటవ్వాలనుకున్నారు. బ్యాంకు ఉద్యోగిని ట్రాప్ చేసింది. ఈ సందర్భంగా ప్లాట్ కొందామని, ఇద్దరు కలిసి ఉందామని , మంచిగా మాట్లాడి డబ్బులు కోరింది. ఇవన్ని నిజమనుకున్న సదరు వ్యక్తి పలు దఫాలుగా 80 లక్షల రూపాయలు అందజేశారు. సదరు మహిళ ప్లాట్ కొనుగోలు పేరుతో కొన్నిసార్లు, ఇంటి నిర్మాణం పేరుతో కొన్నిసార్లు ఈ మొత్తాన్ని తీసుకుంది. పెళ్లి రోజు రాగానే మహిళ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పారిపోయింది. బ్యాంకు ఉద్యోగి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితురాలైన మహిళ కోసం గాలిస్తున్నారు.
రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగికి 80 లక్షలకు టోకరా వేసిన మహిళ !
April 23, 2023
0
Tags