వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్, శాస్త్రి నగర్ లో 11 ఏళ్ల బాలుడు ఆదర్శ్ నిన్న ఉదయం మార్కెట్ కు వెళ్లాడని చాలాసేపటివరకు తిరిగి రాకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారని, ఆదర్శ్ కోసం పలు ప్రాంతాల్లో వెతికారని, చివరకు నిన్న రాత్రి ఆ బాలుడు విగత జీవిగా ఓ చోట పడి ఉండడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారని పోలీసులు తెలిపారు. ఆ బాలుడి ముఖం, కుడి చేతిపై తీవ్రగాయాలు ఉన్నాయని పోలీసులు వివరించారు. వీధి కుక్కల దాడి నుంచి బాలుడు తనను తాను రక్షించుకోవడానికి పోరాడినా అతడి ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోందని వివరించారు. వీధి కుక్కలే అతడిపై దాడి చేసి, చంపాయని నిర్ధారణకు వచ్చినట్లు ఇన్‌స్పెక్టర్‌ కొత్వాలీ రవి రాయ్ తెలిపారు. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుపుతున్నామని చెప్పారు

Post a Comment

0Comments

Post a Comment (0)