పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాకు చెందిన ఇద్దరు యువతులు చేతిలో సిగరెట్ పట్టుకొని, దాన్ని చూపిస్తూ జాతీయ గీతాన్ని పాడారు. అంతేకాదు అందులోని సాహిత్యాన్ని తప్పుగా పాడుతూ, సిగరెట్ తాగుతూ నవ్వుతూ అలపించారు. దీన్ని వీడియో తీసుకుని సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో చాలా మంది నెటిజన్లు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. వారి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారికి కఠిన శిక్ష విధించాలని కోరారు. దీంతో వారిద్దరిపై బరఖ్‌పూర్ సైబర్ సెల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత అమ్మాయిలు ఆ వీడియోను ఫేస్‌బుక్ నుంచి డిలీట్ చేశారు. కేవలం సరదా కోసమే చేశామని, ఈ వీడియో కోసం తమ స్నేహితుడితో పందెం వేశామని, అందుకే ఆ వీడియోను సోషల్ మీడియాలో వారు చెబుతూ వీడియో పోస్ట్ చేశారు. వారి క్షమించరాని త్పపు చేశారంటూ చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. యువతులపై చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ ఇద్దరు యువతులు దోషులుగా తేలితే వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. లేకుంటే జరిమానా విధించవచ్చు లేదా శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది.
సిగరేట్ తాగుతూ జాతీయ గీతం పాడిన యువతులు !
April 11, 2023
0
Tags