రంజాన్ వచ్చిందంటే హైదరాబాద్ నగరంలో బిర్యానీ ఆర్డర్ల గురించి చెప్పక్కర్లేదు. ఈ రంజాన్ సీజన్లో బిర్యానీల ఆర్డర్లు కూడా భారీగా పెరుగుతాయి. ఈ ఏడాది కూడా హలీం, బిర్యానీల ఆర్డర్లు లక్షల్లో జరగడం గమనార్హం. గత ఏడాదిని మంచి విక్రయాలు జరిగాయి. గత ఏడాదితో పోల్చితే బిర్యానీ ఆర్డర్లు 20 శాతం పెరిగాయి. ఇక హలీం ఆర్డర్లు కూడా ఈ ఏడాది భారీగా పెరిగాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న హలీం ప్రియులు పెద్ద మొత్తంలోనే లాగించేశారు. రంజాన్ నెలలో ఫుడ్ ఆర్డర్స్‌పై స్విగ్గీ విడుదల చేసిన డేటా చూస్తూ షాకవ్వాల్సిందే. కేవలం ఈ ఒక్క నెలలోనే 10 లక్షల బిర్యానీ ఆర్డర్లు బుక్ కావడం గమనార్హం. ఇక హలీం విషయానికొస్తే.. 4 లక్షల హలీం ఆర్డర్లు వచ్చాయి. హైదరాబాద్ నగరం, శివార్లలోని మొత్తం 350 రెస్టారెంట్ల నుంచి 50 శాతం ఆర్డర్స్ రాగా.. ఇందులో పిస్తా హౌస్ హలీం టాప్ పొజిషన్‌లో ఉంది. ఇక బిర్యానీ ఆర్డర్స్ లో ప్యారడైజ్, మెహఫిల్ ఫేవరేట్‌గా నిలిచింది. హలీంలో చాలా రకాలు ఉన్నా.. మటన్ హలీం వాటా అత్యధికంగా 77 శాతంగా ఉంది. మాల్పువా, ఫిర్నీ, రబ్డీ వంటివి పండుగల ప్రత్యేక డెజర్ట్‌ల ఆర్డర్‌లలో 20 శాతం పెరుగుదల కనిపించింది. రంజాన్ నెలలో డ్రైఫ్రూట్స్, ఫ్రూట్ సలాడ్స్ సైతం భారీగా ఆర్డర్స్ వచ్చాయని.. మెజార్టీ మాత్రం హలీం, బిర్యానీ నిలిచిందని స్విగ్గీ వెల్లడించింది. 2023, మార్చి 23 నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు వచ్చిన ఆర్డర్ల డేటా ఇది. ఇంకా మరో ఐదు రోజులు ఉండటంతో హలీం, బిర్యానీల ఆర్డలు మరింతగా పెరిగే అవకాశం లేకపోలేదు.
రంజాన్ సీజన్ లో దుమ్మురేపిన బిర్యానీ, హలీమ్ ఆర్డర్లు !
April 21, 2023
0
Tags