అదుపు తప్పి గుంతలోకి దూసుకు పోయిన బస్సు !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని రామచంద్రాపురం ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ ఒక చేతిలో పావురాన్ని పట్టుకొని, మరో చేతితో బస్సును నడపటంతో అదుపు తప్పి బస్సు జాతీయరహదారి పక్కన ఉన్న గుంతలోకి దూసుకు పోయింది. ప్రయాణికులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హెచ్‌సీయు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సికింద్రాబాద్‌ నుంచి పటాన్‌చెరుకు వస్తోంది. బస్సు వస్తున్న క్రమంలో కేపీహెచ్‌బీ వద్ద ఓ పావురం బస్సుకు ఎదురుగా వచ్చింది. దాంతో బస్సు డ్రైవర్‌ దస్తగిర్‌ బస్సును ఆపి ఆ పావురాన్ని పట్టుకోమని ఓ ప్రయాణికుడికి చెప్పాడు. అతడు పావురాన్ని పట్టుకొని బస్సులో కూర్చున్నాడు. ప్రయాణికుడు లింగంపల్లిలో బస్సు దిగుతూ ఆ పావురాన్ని డ్రైవర్‌ దస్తగిరికు ఇచ్చాడు. లింగంపల్లి నుంచి జ్యోతినగర్‌ వరకు జాతీయ రహదారిపై ఫ్లయిఓవర్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా గండమ్మ ఆలయం సమీపంలో రోడ్డు పక్కన పెద్ద గుంత తవ్వారు. ప్రమాదాలు జరగకుండా సిమెంట్‌ దిమ్మెలను ఏర్పాటు చేశారు. డ్రైవర్‌ బస్సును కొంచెం వేగంగా నడపటంతో అదుపు తప్పి సిమెంట్‌ దిమ్మెలను ఢీ కొని గుంతలోకి దూసుకు పోయింది. ఆ సయంలో బస్సులు సుమారు 30 మంది ప్రయాణికులున్నారు. అందరూ  స్వల్పగాయలతో బయట పడారు. గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆటోల్లో వెళ్లిపోయారు. దీంతో అందరూ ఊపిరి పిల్చూకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)