రోడ్డు ప్రమాదం నీరజా రెడ్డి దుర్మరణం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ నుంచి కర్నూల్ వెళ్తుండగా ఆదివారం జరిగిన ప్రమాదంలో ఆమె మరణించారు. గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి వంతెన వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. వెనుక టైర్ పేలడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. నీరజారెడ్డి 2009లో ఆలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2011లో నియోజకవర్గంలో పనులు జరగడం లేదని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి గుడ్ బై చెప్పి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ 2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. అనంతరం ఉన్నట్టుండి వైసీపీని వీడి బీజేపీ కండువా కప్పుకున్నారు. ప్రస్తతం బీజేపీ ఆలూరు ఇంఛార్జ్‌గా నీరజారెడ్డి ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)