అతి పిన్న వయసులో డాక్టరేట్‌ సాధించిన నైనా జైస్వాల్‌ !

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లోని నారాయణగూడ ప్రాంతానికి చెందిన నైనా జైస్వా‍ల్‌.. ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం ఆది కవి నన్నయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ అందుకున్నారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాకు సంబంధించి 'మహిళా సాధికారతలో మైక్రోఫైనాన్స్‌ పాత్రపై అధ్యయనం' అనే అంశంపై నైనా జైస్వాల్‌ పరిశోధన చేశారు. ఈ సందర్భంగా నైనా జైస్వాల్‌ను రిసెర్చ్‌ గైడ్‌, యూనివర్సిటీ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ ఎం. ముత్యాల నాయుడు అభినందించారు. కాగా టీటీ ప్లేయర్‌గా పలు జాతీయ, అంతర్జాతీయ టైటిళ్లు అందుకున్న నైనా చదువులోనూ తనకు తానే సాటి నిలిచారు. ఎనిమిదేళ్లకే పదో తరగతి కంప్లీట్‌ చేసిన నైనా,13 ఏళ్లకే గ్రాడ్యుయేషన్‌, 15 ఏళ్లకు మాస్టర్స్‌లో డిగ్రీ సాధించారు. ఈ క్రమంలో ఆసియాలోనే చిన్న వయసులో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి అరుదైన రికార్డు సృష్టించారు. మోటివేషనల్‌ స్పీకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నైనా.. తన తల్లి భాగ్యలక్ష్మితో కలిసి ఎల్‌ఎల్‌బీ చదువుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)