వైఎస్సార్ కడప జిల్లా బద్వేలులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో తెదేపా అధినేత చంద్రబాబు మాట్లాడుతూ గెలుపే ధ్యేయంగా కార్యకర్తలు ఐకమత్యంతో పని చేయాలని పిలుపునిచ్చారు. బంధువులు, రక్త సంబంధీకులు వదిలేసినా పార్టీ వెంట ఉంటుందని కార్యకర్తలకు సూచించారు. తెదేపా పాలన వల్ల విదేశాల్లో స్థిరపడిన వారంతా పార్టీకి విరాళాలు ఇవ్వాలని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు. రూ.5వేలు విరాళం ఇచ్చిన వారికి జీవితకాల సభ్యత్వం ఇస్తామని.. కార్యకర్తలను ఆదుకునే బాధ్యత పార్టీదే అని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు చేశారు. ''జగన్ ఎక్కడ ఉంటే.. అక్కడ శనే.. జగన్ ఓ ఐరన్‌లెగ్. అమరావతిని నాశనం చేశారు. ఇప్పుడు విశాఖ నుంచి పాలిస్తానని చెబుతున్నారు. ఆయన్ను చూసి విశాఖ వాసులు భయపడుతున్నారు. జగన్ పదవికి ఎక్స్‌పైరీ డేట్ వచ్చేసింది. ఇకపై జన్మలో ఆయన సీఎం కాలేరు'' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
జగన్ ఇక జన్మలో సీఎం కాలేరు !
April 19, 2023
0
Tags