పెళ్లి మండపంలో వరుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు

Telugu Lo Computer
0


ఒడిశాలోని బార్ గఢ్ జిల్లాలోని ఢెంకానాల్‌కు చెందిన అజిత్ కుమార్ భోయ్ ఒడిశా ఆర్టీసీ జేఈఈగా ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఓ యువతితో వివాహం కుదిరింది. మంగళవారం రాత్రి పెద్దలు పెళ్లికి ముహూర్తాన్ని కుదిర్చారు. కాగా, అతగాడు గత రెండేళ్లుగా భువనేశ్వర్‌కు చెందిన మరో యువతితో ప్రేమాయణం నడిపాడు. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. ఇప్పుడు ఆ మాట తప్పి మరో యువతితో మూడు ముళ్లకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసిన యువతి  ప్రియుడిపై భువనేశ్వర్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అతడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు  పెళ్లి మండపానికి వెళ్లి అజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసి వధువు కుటుంబ సభ్యులు అవాక్కు అయ్యారు. పెళ్లి పీటలు ఎక్కడానికి ముందే ఈ తంతు ముగియండంతో వధువు కుటుంబ సభ్యులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పెళ్లికి పెట్టిన బంగారం గొలుసు, ఉంగరం, పలు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకొని వధువు కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)