కారును గాడిదలతో షోరూంకు లాక్కెళ్లి వినూత్ననిరసన !

Telugu Lo Computer
0


రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని సుందర్‌వాస్‌ ప్రాంతంలో శంకర్‌లాల్ అనే వ్యక్తి రూ.17.5 లక్షలు పెట్టి కారు కోనుగోలు చేశాడు. ఆ సంతోషం కొద్ది రోజులు కూడా లేకుండాపోయింది. తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తి కారు మొరాయిస్తోంది. షోరూంకు తీసుకెళ్లి రెండు సార్లు రిపేరు చేయించినా పరిస్థితిలో మార్పు లేదు. వారు సమస్యను పరిష్కరించడం లేదు, సరైన స్పందనా లేదు. ఈసారి మళ్లీ కారు మొరాయించడంతో దాన్ని షోరూంకు తీసుకెళ్లేందుకు అతడు వినూత్నంగా ఆలోచించాడు. రెండు గాడిదలతో కారును షోరూం వరకు లాక్కెళ్లాడు. డీలర్‌పై తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేశాడు.  ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బ్యాటరీ డౌన్ అయ్యి కారు ఆగిపోతోందని, కొద్ది దూరం నెట్టితే నార్మల్ అవుతుందని షోరూం వాళ్లు చెప్పారని, కానీ అలా ఎన్నిసార్లు చేసినా సమస్య పరిష్కారం కాలేదని రాజ్‌కుమార్ తెలిపాడు. తమ కారుకు రీప్లేస్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. అయితే షోరూం నిర్వాహకులు మాత్రం తమ వైపు నుంచి ఎలాంటి తప్పులు లేవని బుకాయిస్తున్నారు. యజమాని తన కారుకు కొన్ని మాడిఫికేషన్స్ చేశారని, అందుకే సాంకేతిక సమస్యలు వస్తున్నాయని చెప్పారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)