సంక్షేమ క్యాలెండర్‌ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

Telugu Lo Computer
0


2023-24 సంవత్సరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్‌ 2023-24 ను  ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి జగన్‌ ఆవిష్కరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సమాచార శాఖ కమిషనర్‌ తుమ్మా విజయ్‌కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 నెలల్లోనే వివిధ సంక్షేమ పథకాల ద్వారా 2,96,148.09 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు అందించామన్నారు మంత్రి చెల్లుబోయిన. అనంతరం 2023-24 సంవత్సరానికి సంబంధించి వివిధ సంక్షేమ పథకాలు, వాటికి కేటాయించిన నిధుల వివరాలను పొందు పరచిన క్యాలెండర్‌ను సీఎం జగన్‌ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఏప్రిల్‌ 2023 - జగనన్న వసతి దీవెన, వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం, మే 2023 - వైఎస్సార్‌ రైతు భరోసా - పీఎం కిసాన్‌ (మొదటి విడత), వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, జగనన్న విద్యాదీవెన(మొదటి విడత), వైఎస్సార్‌ కళ్యాణమస్తు-షాదీ తోఫా (మొదటి త్రైమాసికం), వైఎస్సార్‌ మత్స్యకార భరోసా, జూన్‌ 2023 - జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్‌ లా నేస్తం (మొదటి విడత), మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి, జులై 2023 - జగనన్న విదేశీ విద్యా దీవెన (మొదటి విడత), వైఎస్సార్‌ నేతన్న నేస్తం, ఎంఎస్‌ఎంఈ ప్రోత్సాహకాలు, జగనన్న తోడు (మొదటి విడత), వైఎస్సార్‌ సున్నా వడ్డీ (ఎస్‌హెచ్‌జీ), వైఎస్సార్‌ కళ్యాణమస్తు-షాదీ తోఫా (రెండో త్రైమాసికం), ఆగష్టు 2023 - జగనన్న విద్యా దీవెన (రెండో విడత), వైఎస్సార్‌ కాపు నేస్తం, వైఎస్సార్‌ వాహనమిత్ర, సెప్టెంబర్‌ 2023 - వైఎస్సార్‌ చేయూత, అక్టోబర్‌ 2023 - వైఎస్సార్‌ రైతుభరోసా - పీఎం కిసాన్‌ (రెండో విడత), జగనన్న వసతి దీవెన (మొదటి విడత), నవంబర్‌ 2023 - వైఎస్సార్‌ సున్నావడ్డీ - పంట రుణాలు, వైఎస్సార్‌ కళ్యాణమస్తు-షాదీతోఫా (మూడవ త్రైమాసికం), జగనన్న విద్యాదీవెన (మూడో విడత), డిసెంబర్‌ 2023 - జగనన్న విదేశీ విద్యాదీవెన (రెండవ విడత), జగనన్న చేదోడు, మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి, జనవరి 2024 - వైఎస్సార్‌ రైతుభరోసా - పీఎం కిసాన్‌ (మూడవ విడత), వైఎస్సార్‌ ఆసరా, జగనన్న తోడు (రెండవ విడత),వైఎస్సార్‌ లా నేస్తం (రెండవ విడత), పెన్షన్ల పెంపు (నెలకు రూ. 3000), ఫిబ్రవరి 2024 - జగనన్న విద్యా దీవెన (నాల్గవ విడత), వైఎస్సార్‌ కళ్యాణమస్తు-షా దీతోఫా (నాలుగో త్రైమాసికం), వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం, మార్చి 2024 - జగనన్న వసతి దీవెన (రెండవ విడత), ఎంఎస్‌ఎంఈ ప్రోత్సాహకాలు.

Post a Comment

0Comments

Post a Comment (0)