హర్యానా లోని కర్నల్ జిల్లా కైతల్‌లోని ఓ కాలేజీలో లా అండ్ సైబర్ క్రైమ్‌పై ఆ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేణు భాటియా మాట్లాడుతూ 'లైంగిక వేధింపుల కేసుల్లో చాలా వరకు బాలికలు బాధ్యులవుతున్నారు. అమ్మాయిలు ఓయే రూమ్‌కు వెళ్లేది హారతులు ఇవ్వడానికి కాదు. అలాంటి ప్రదేశాలకు వెళ్లే ముందు ఆ ప్రదేశంలో మీకు హాని కూడా జరగవచ్చని గుర్తుంచుకోండి' అంటూ వ్యాఖ్యానించారు. సహజీవనం చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. సహ జీవనం విషయంలో సుప్రీం కోర్టు జారీ చేసిన గైడ్‌టైన్స్ వల్ల సహ జీవనం ద్వారా మహిళలకు ఎదురయ్యే సమస్యలు పరిష్కరించడంలో తమ పరిధి చాలా తక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు. సహజీవనంతో నేరాలు పెరిగిపోతున్నాయని, మహిళలపై లైంగిక దాడులు జరగడానికి వారు కూడా కారణమని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓయో రూమ్స్‌కి వెళ్లే ముందు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో ఆలోచించరా ? స్నేహం పేరుతో అక్కడ ఏదో తప్పు పనే జరుగుతుందని ముందుగా గుర్తించాలని ఆమె చెప్పుకొచ్చారు. ఇప్పుడీ కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి. రేణు భాటియా చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుపడుతుంటే మరికొందరు మాత్రం సమర్థిస్తున్నారు.
హర్యానా మహిళా కమిషన్ చైర్ పర్సన్ వివాదస్పద వ్యాఖ్యలు
April 21, 2023
0
Tags