కర్నాటక లోని యశ్వంత్‌పూర్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి ఎస్‌టి సోమశేఖర్ తన మీటింగుకు వస్తే, వచ్చిన ప్రతి ఒక్కరికీ బిర్యానీ పెడతాను రమ్మంటూ ప్రచారం చేశాడు. సభల్లో కూడా మీటింగ్ అయ్యిందాకా ఎవ్వరూ వెళ్ళిపోకండి అందరికీ బిర్యానీ పెడతాం అంటూ ఆయనే స్వయంగా మైకులో ప్రకటిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆయనపై జనతాదళ్ (సెక్యులర్) రాష్ట్ర న్యాయ విభాగం అధ్యక్షుడు ఎపి రంగనాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని సోమశేఖర్ ఉల్లంఘించారంటూ ఆయన పిర్యాదులో పేర్కొన్నారు. రంగనాథ్ సమర్పించిన వీడియో క్లిప్పింగ్ ఆధారంగా విచారణ చేసిన పోలీసులు బీజేపీ అభ్యర్థి సోమశేఖర్ ప్రజలకు లంచం (బిర్యానీ) ఇవ్వజూపినట్టు ధృవీకరించుకొని ఆయనపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.
బీజేపీ అభ్యర్థిపై కేసు నమోదు !
April 14, 2023
0
Tags