‘డిజిలాకర్’లో ముఖ్యమైన పత్రాలను అప్‌లోడ్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పొల్యూషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్.. ఇలా ఏ డాక్యుమెంట్స్ అయినా కూడా సులభంగా ఈ యాప్‌లో సేవ్ చేయవచ్చు. మీరెప్పుడైనా ట్రాఫిక్ తనిఖీల్లో చిక్కుకున్నప్పుడు.. మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా ఈ డిజిలాకర్ యాప్‌లో ఉన్న హార్డ్ కాపీ చూపిస్తే చాలు. డిజిటల్ ఇండియా నేపధ్యంలో కేంద్రం వాహనానికి అవసరమయ్యే అన్ని డాక్యుమెంట్స్ ఒకే చోట ఉండేలా పలు యాప్‌లను సిద్దం చేసింది. అవే Digilocker, mParivahan. 2018లో భారత ప్రభుత్వ రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ డిజిలాకర్, mParivahan మొబైల్ యాప్‌లలో అప్‌లోడ్ చేసిన పత్రాలను అసలైనవిగా నిర్ధారించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.
డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా, డిజిలాకర్ ఉంటే చాలు !
April 30, 2023
0
Tags