సైఫ్‌కు బెయిల్ మంజూరు

Telugu Lo Computer
0


వరంగల్ మెడికో ప్రీతి మృతి కేసులో నిందితుడిగా జైలులో శిక్ష అనుభవిస్తున్న డాక్టర్‌ సైఫ్‌ కి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. పది వేల నగదు, ఇద్దరి పూచికత్తుపై బెయిల్ ఇచ్చింది. 16వారాల పాటు ప్రతి శుక్రవారం కేసు విచారణ అధికారి ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో డాక్టర్ సైఫ్ సాక్ష్యులను బెదిరించినా, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేసిన బెయిల్ రద్దు చేయబడుతుందని కోర్టు హెచ్చరించింది. సైఫ్‌కు బెయిల్ మంజూరు చేసినట్లుగా వరంగల్ జిల్లా ఎస్పీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. ప్రీతి ఫిబ్రవరి 22న ఆత్మహత్యాయత్నం చేసుకుంది. హైదరాబాద్ నిమ్స్‌ల ట్రీట్మెంట్ పొందుతూ రెండ్రోజులకు చనిపోయింది. ఈకేసుల అప్పట్లో సంచలనంగా మారింది. కేవలం సీనియర్‌గా ఉన్నటువంటి సైఫ్ ర్యాగింగ్, వేధింపుల వల్లే ప్రీతి చనిపోయిందన్న మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ఫిబ్రవరి 24న సైఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 55రోజుల తర్వాత బెయిల్ మంజూరు చేసారు.

Post a Comment

0Comments

Post a Comment (0)