ప్రాణాలు తీసిన వందే భారత్‌ రైలు !

Telugu Lo Computer
0


రాజస్తాన్‌లో ఓ ఆవు వందే భారత్‌కు అడ్డుగా వచ్చి ప్రాణాలు విడిచింది. ఈ ఘటనలో ఆవు శరీర భాగాలు బలంగా ఢీకొట్టడంతో ఆ సమీపంలో మూత్ర విసర్జన చేస్తున్న వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. అల్వార్‌లోని అరవాలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న వందే భారత్‌ రైలు ఆవును ఢీకొనడంతో, దాని శరీర భాగాలు ఛిద్రమై 30 మీటర్ల దూరంలో మూత్రవిసర్జన చేస్తున్న శివదయాల్‌ శర్మపైపడి అతను అక్కడికక్కడే మృతి చెందడం కలచివేసింది. ఆవు శరీర భాగం దూరంలో ఉన్న శివదయాల్‌పై పడటంతో అతను అక్కడికక్కడే మరణించాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడు భారతీయ రైల్వేలో 23 ఏళ్లు ఎలక్ట్రీషియన్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యాడని పోలీసులు తెలిపారు. శివదయాల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించామని వెల్లడించారు. ఇదిలా ఉండగా సెమీ హై స్పీడ్‌ వందే భారత్‌ రైళ్లు ఆవులు, గేదెలను ఢీకొన్న సంఘటనలు ఎక్కువ శాతం ముంబాయి - గుజరాత్‌ రైల్వే లైన్‌లో జరిగినట్టుగా ఓ నివేదిక పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)