చెన్నై - ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

Telugu Lo Computer
0


చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఉన్నట్లుండి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. బి-5 బోగీ నుంచి ఈ పొగలు రావడం గమనించిన రైల్వే సిబ్బంది ఈ రైలును నెల్లూరు జిల్లా కావలి వద్ద సుమారు 20 నిమిషాలపాటు ఆపివేశారు. దీంతో ప్యాసింజర్స్ ఆందోళనకు గురయ్యారు. రైల్వే సిబ్బంది, అధికారులు వేగంగా స్పందించడంతో ప్రమాదం తప్పినట్లయింది. బ్రేకులు ఫెయిల్‌ కావడంతోనే పొగలు వచ్చినట్లు కావలి రైల్వేస్టేషన్‌ సూపరింటెండెంట్‌ శ్రీహరిరావు వెల్లడించారు. పొగలు రావడం గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే మరమ్మతులు చేపట్టారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం రాజధాని ఎక్స్‌ప్రెస్‌ అక్కడి నుంచి బయల్దేరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)