కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బి.ఎన్. చంద్రప్ప

Telugu Lo Computer
0


కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మరి కొన్ని రోజుల్లో జరుగనున్నాయి. దీనికి ముందు కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బి.ఎన్.చంద్రప్పను ఆదివారం నియమించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయనను కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారని ఆ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. కర్నాటక యూనిట్‌కు డి.కె.శివకుమార్ నేతృత్వం వహిస్తున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్. ధ్రువనారాయణ గత నెల మృతి చెందడంతో చంద్రప్పను నియమించారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ఇప్పటి వరకు 142 మంది అభ్యర్థులను ప్రకటించారు. కర్నాటకలో బిజెపి నుంచిఅధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)