ఎయిరిండియా విమానం అత్యవసర ల్యాండింగ్‌

Telugu Lo Computer
0


ఎయిరిండియాకు చెందిన విమానం సోమవారం ఉదయం అత్యవసరంగా ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయ్యింది. క్రమశిక్షణను ఉల్లంఘించిన ఓ ప్రయాణికుడిని విమానం నుండి బయటికి పంపిన అనంతరం తిరిగి టేకాఫ్‌ అయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 225 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుండి లండన్‌ వెళ్తున్న ఎఐ 111 విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే తిరిగి ల్యాండ్‌ అయినట్లు ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (ఐజిఐఎ) ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికుడిని బయటికి పంపిన అనంతరం తిరిగి లండన్‌ హీత్రూకు బయలుదేరిందని అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)