మనషులే కాదు నోరు లేని మూగజీవాలు సైతం క్రమశిక్షణగా నడుచుకుంటాయి. వానరాలు ఎంతో బుద్ధిగా ఓ వరుస క్రమంలో కూర్చొని అల్పాహారం, స్వీట్లు తిన్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా మహారాష్ట్ర లోని అకోలా జిల్లా కోతలి గ్రామంలో ముంగ్సాజీ మహరాజ్ సంస్థాన్ తరపున భక్తులకు అల్పాహారం, స్వీట్లు పంచిపెట్టారు. అదే సమయంలో భక్తులకు పెట్టినట్లుగానే కోతులకు స్టీల్ ప్లేట్లు పెట్టి అందులో స్వీట్లు వడ్డిస్, వానరాలు ఓ క్యూలో కూర్చొని బుద్దిగా వాటిని ఆరగించాయి. ఇప్పుడు ఈఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనుషులతో సమానంగా ఎంతో శ్రద్దగా, బుద్ధిగా కూర్చొని అల్పాహారం తింటుంటే అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ముంగ్సాజీ మౌలి సంస్థాన్ నిత్యం హనుమాన్ జయంతికి ఈలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా కోతలి గ్రామంలో పచ్చని చెట్ల మధ్యలో సుందరమైన అటవీ ప్రాంతంలో ఈ విందు ఏర్పాటు చేశారు. అయితే కోతులు హనుమాన్ ప్రతిరూపంగా భావిస్తారు కాబట్టి ఈసారి భక్తులతో పాటు వాటికి విందు పెట్టాలని, ప్రసాదం అందించాలని నిర్వాహకులు స్టీల్ ప్లేట్లలో అల్పాహారం, స్వీట్లను వడ్డించినట్లుగా నిర్వాహకులు రామదాస్ మహరాజ్ తెలిపారు.
విందులో వానరాల శ్రమశిక్షణ !
April 08, 2023
0
Tags