ఉట్నూర్‌లో పదో తరగతి తెలుగు ఆన్సర్ షీట్స్ బండిల్ గల్లంతు !

Telugu Lo Computer
0


తెలంగాణ లోని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో పదో తరగతి తెలుగు ఆన్సర్ షీట్స్ మాయమయ్యాయి. పోస్టాఫీస్ నుంచి బస్టాండ్‌కు తరలిస్తుండగా ఆటో నుంచి తెలుగు ఆన్సర్ షీట్స్ బండిల్ కిందపడింది. 30 మంది విద్యార్థుల ఆన్సర్ షీట్స్ మిస్సింగ్ అయ్యాయి. ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో సబ్ పోస్ట్‌మాస్టర్ ఫిర్యాదు చేశారు. జవాబు పత్రాలు జిల్లా కేంద్రానికి తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పేపర్ బండిల్ మాయంపై విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)