తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల అధికారులు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు చేశారు. అవసరమైతేనే బయటకు వెళ్లాలంటూ అధికారులు సూచిస్తున్నారు. ఇంకా వడదెబ్బ తగలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఏపీలో 98 మండలాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. అల్లూరి, అనకాపల్లి, తూ.గో, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, కడప జిల్లాల్లో వడగాల్పులకు అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో 44 డిగ్రీల కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలంతా ఎండదెబ్బ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దంటూ అధికారులు సూచిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మండే ఎండలపై హెచ్చరికలు జారీ
April 19, 2023
0
Tags