తమిళనాడులోనే తమిళ చిత్రాలు షూటింగ్ జరగాలి !

Telugu Lo Computer
0


చెన్నైలో కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ దక్షిణ్ సమ్మిట్ ఘనంగా జరుగుతుంది. మరో రెండు రోజులు ఈ సదస్సు సాగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. దక్షిణ భారతదేశాన్ని వివిధ రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లడానికి సీఐఐ  దక్షిణ్ సమ్మిట్ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం మొదటి రోజు సుహాసిని, అల్లు అరవింద్, సెల్వమణి, ఉదయనిధి స్టాలిన్, స్వామినాథన్, కార్తీ, రిషబ్ శెట్టి, మంజు వారియర్, వెట్రిమారన్ వంటి  అనేకమంది ప్రముఖులు విచ్చేశారు. సెల్వమణి మాట్లాడుతూ ఇప్పటివరకు సౌత్ లో దాదాపు 50 వేలకు పైగా సినిమాలు తెరకెక్కాయి. ఇటీవల మన సినిమాలు మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. కానీ తమిళ సినిమాలు తమిళ నాడులో కాకుండా వేరే రాష్ట్రాల్లో, వేరే ప్రదేశాల్లో ఎక్కువగా షూటింగ్స్ చేస్తున్నారు. కొన్ని సినిమాలు అయితే మొత్తం తమిళనాడు బయటే షూట్ చేస్తున్నారు. దీంతో ఇక్కడి కార్మికులు నష్టపోతున్నారు. తమిళ సినిమాల షూటింగ్స్ తమిళనాడులోనే అధికంగా జరిగేలా తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సినిమాలనే నమ్ముకున్న కార్మికులకు ప్రోత్సాహం లేదు. వారి కోసం తమిళనాడు ప్రభుత్వం సినీ కార్మికుల డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అని వ్యాఖ్యానించారు. దీనిపై నటుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ తమిళనాడు ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్టాలిన్ సినీ పరిశ్రమకు అండగా ఉంటారు. సెల్వమణి, తదితరులు సినీ పరిశ్రమ గురించి అడిగిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతాను అని అన్నారు. ఇక ఈ సమ్మిట్ లో ఇటీవల ఆస్కార్ సాధించిన ఆర్ఆర్ఆర్  టీం నుండి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ని, ది ఎలిఫెంట్‌ ఆఫ్‌ విస్పరర్స్‌ సినిమా డైరెక్టర్ కార్తీకిని సన్మానించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)