మ్యాంగో- పానీ పూరీ !

Telugu Lo Computer
0


'మ్యాంగో పానీ' పూరీ .. తాజాగా ఓ వ్యాపిరి మ్యాంగో పానీపూరీని అమ్ముతున్నాడు. @bombayfoodie_tales అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ దీనికి సంబంధించిన వీడియోని షేర్ చేసాడు. అంతే జనాలు షాకయ్యారు. ఒక ప్లేట్ లోకి పూరీలను తీసుకుని దానికి చోలె మిక్స్‌ని కలిపాడు. ఆ తరువాత తీసి పెట్టుకున్న మామిడికాయ జ్యూస్ దానిపై పోసాడు ఆ వ్యాపారి. ఇలా మ్యాంగో పానీపూరీని అందరికీ అందిస్తున్నాడు. ఈ కాంబినేషన్ తినడం అనేది ఎంత వరకూ సేఫ్ తెలియదు. ఇక తిన్నవాళ్ల సంగతి కూడా ఏమో కానీ ఇంటర్నెట్ లో ఈ వీడియో వైరల్ అవుతోంది. 'ఇలాంటి కాంబినేషన్లు ఆరోగ్యానికి హానికరం. తిండితో ఆటలు వద్దు'.. అంటూ యూజర్లు అభిప్రాయపడుతున్నారు. కొన్ని ఆహారపదార్ధాలు కలయిక వల్ల పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారం పెంచుకునేందుకు అమ్మకం దారులు కొత్త కొత్త కాంబినేషన్లతో జనం ముందుకు వస్తారు. అయితే ఈ కాంబినేషన్లు ఎంతవరకూ సేఫ్ అనేది తినే ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)