హర్యానాలోని పానిపట్ జిల్లా దిద్వాడి గ్రామానికి చెందిన నరేంద్రసింగ్ అనే రైతు ఈ 'షెహన్‌షా' దున్నను పెంచి పోషిస్తున్నాడు. నరేంద్రసింగ్ పెంచుకునే ఈ దున్నపోతు వయస్సు పదేళ్లు. ఆరడుగుల ఎత్తు, 15 అడుగుల పొడవుతో మాంచి బలిష్టంగా నల్లగా నిగనిగలాడిపోతుంటుంది. ముర్రా జాతికి చెందిన ఈ జాతి దున్నల వీర్యానికి దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. వీర్యంతో దాదాపు 800 డోసులను తయారు చేస్తారు. వీటిని వేరు చేసే ప్రక్రియలో ప్రతి డోసుకు రూ. 300 వరకు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత దీనిని మార్కెట్లో అమ్ముతారు. అలా ప్రతినెలా దున్న వీర్యాన్నిఅమ్మటం ద్వారా నెలకు రూ. 9.60 లక్షల ఆదాయం నరేంద్రసింగ్ కు లభిస్తోంది. 'షెహన్‌షా'కు నరేంద్రసింగ్ ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. 'షెహన్‌షా' కోసం ప్రత్యేకంగా ఈత కొలను కట్టించారు. ఎక్కడ పశువుల పోటీలు ఉంటే అక్క 'షెహన్‌షా' దర్శనమిస్తుంది. విజేతగానూ నిలిచి బహుమతులు అందుకోవటం 'షెహన్‌షా'కు సర్వసాధారణంగా మారిపోయింది. అలా ఓ చాంపియన్‌షిప్‌లో రూ. 30 లక్షలు బహుమతి గెలుచుకుని మరోసారి ముర్రాజాతి గొప్పతనాన్ని చాటింది.
దున్న ఖరీదు రూ. 25 కోట్లు !
April 13, 2023
0
Tags