అసోసియేషన్ ఫర్ డెముక్రటిక్ రీఫార్మ్స్ ( ఏడీఆర్ ) గణాంకాల ప్రకారం 2021-2022 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ పార్టీలకు విరాళాలకు సంబంధించి భారత రాష్ట్ర సమితి పార్టీ రూ. 40. 9 కోట్లు విరాళాలు అందుకొని దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో 38.2 కోట్లు విరాళాలు అందుకొని ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. మూడో స్థానంలో జేడీఎస్ రూ. 33.2 కోట్లు అందుకొంది. అలాగే సమాజ్ వాదీ పార్టీకి రూ. 29.7 కోట్లు, వైఎస్సార్పీపీకి రూ. 20 కోట్ల విరాళాలు అందినట్లు ఏడీఆర్ నివేదికలో వెల్లడించింది. ఆయా పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల ఆధారంగా ఈ గణాంకాలు వెల్లడించింది. దేశంలోని మొత్తం 26 ప్రాంతీయ పార్టీలకు రూ. 189.8 కోట్లు అందినట్లు నివేదికలో పేర్కొన్నారు. వీటిలో రూ. 162.21 కోట్ల విరాళాలు ఐదు పార్టీలే అందుకున్నట్లు తెలిపింది. అయితే ఏఐఏడీఎంకే, బీజేడీ, ఎన్డీపీపీ, ఎస్డీఎఫ్, ఏఐఎఫ్బీ, పీఎంకే, జేకేఎన్సీ పార్టీలు తమకు అందిన విరాళాల వివరాలను వెల్లడించలేదు. కాగా.. ప్రాంతీయ పార్టీగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల సంఘం ఈ నెలలోనే జాతీయ పార్టీగా గుర్తింపును ఇచ్చింది. అయితే బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక విరాళాలు వచ్చాయని ఏడీఆర్ రిపోర్ట్ వెల్లడించింది.
ప్రాంతీయ పార్టీల విరాళాలలో బీఆర్ఎస్ నెంబర్ 1!
April 25, 2023
0
Tags