దేశంలో గత 24 గంటల్లో 10,158 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 44,998కి చేరింది. గడిచిన 24గంటల్లోనే రోజువారి కొత్తకేసులసంఖ్య 10వేలు దాటింది. అంటే 24గంటల్లోనే 30శాతం ఎక్కువగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 4.42 శాతంగా నమోదు కాగా.. వారం వారీగా పాజిటివిటీ రేటు 4.02 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.10శాతంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొవిడ్ -19 రికవరీ రేటు 98.71శాతంగా నమోదైంది. మరణాల రేటు 1.19శాతం నమోదైంది. ఇదిలాఉంటే ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.16 వేగంగా వ్యాప్తి చెందుతోందని, దీని వల్ల కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య మాత్రం తక్కువగానే ఉంటుంది. దేశంలో కరోనా ఎండమిక్ దశలో ఉందని, తదుపరి 10-12 రోజుల పాటు కరోనా కేసులు పెరుగుతూనే ఉంటాయని, ఆ తరువాత తగ్గుముఖం పడతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
దేశంలో కొత్తగా 10,158 కరోనా కేసులు నమోదు
April 13, 2023
0
Tags