వెంకయ్యనాయుడికి ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వడం నాకు నచ్చలేదు !

Telugu Lo Computer
0


వెంకయ్యనాయుడికి ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వడం నాకు నచ్చలేదు. గొప్ప నాయకుడిని రాజకీయాల నుంచి దూరం చేశారన్నారని  తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు.  ఉప రాష్ట్రపతి హోదాలో ఎలాంటి అధికారాలు ఉండవు. చాలా విషయాల్లో ప్రోటోకాల్ కండిషన్స్ ఉంటాయని రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. నేను ఉప రాష్ట్రపతి పదవిని కించపరచడం లేదు.  వెంకయ్యనాయుడు మరికొన్ని రోజులపాటు కేంద్రమంత్రిగా కొనసాగివుంటే బాగుండేదన్నారు. చిన్న మచ్చకూడా లేకుండా ఉన్న వ్యక్తి వెంకయ్యనాయుడు అన్నారు. గతంలోనూ అనేక మార్లు ఉప రాష్ట్రపతి పదవి విషయంలో వెంకయ్యనాయుడు తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రాజకీయాల్లో అనేక మంది కూడా ఉప రాష్ట్రపతి పదవి ఇచ్చి వెంకయ్యనాయుడిని రాజకీయాలకు దూరం చేశారని అభిప్రాయపడ్డారు. తాజాగా రజనీకాంత్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రజనీకాంత్ వ్యాఖ్యలపై ఎలాంటి కామెంట్లు వస్తాయో చూడాలి మరి.

Post a Comment

0Comments

Post a Comment (0)