కోతుల మూకుమ్మడి దాడిలో వృద్ధురాలు మృతి !

Telugu Lo Computer
0


తెలంగాణలోని కామారెడ్డి జిల్లా రామారెడ్డి లో కోతుల గుంపు దాడిలో నర్సవ్వ అనే 70 ఏళ్ల వృద్దురాలు మృతి చెందారు. గురువారం ఇంట్లో అన్నం తింటున్న సమయంలో కోతుల గుంపు నర్సవ్వ పై దాడి చేసింది. ఆ గుంపు నుండి తప్పించుకునే ప్రయత్నంలో కిందపడిపోయిన నర్సవ్వ తలకు తీవ్ర గాయం అయింది. కామారెడ్డి లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన నర్సవ్వ శనివారం రోజు మరణించారు. నర్సవ్వ కు నలుగురు కుమార్తెలు. చిన్న కూతురు తల్లి దగ్గరే ఉంటున్నారు. నర్సవ్వ అడపదడపా కూలీ పనులకు వెళ్లేవారు. ''ఆరోజు, నా కూతురు శ్రీమంతం కార్యక్రమం కోసం కామారెడ్డి పోయాను. ఇంట్లో అన్నం తినే సమయంలో మా అమ్మ పై కోతులు దాడి చేసాయి. చుట్టుపక్కల వారు వచ్చి చూసే సరికే తీవ్రంగా గాయపడి ఉంది. విషయం తెలిసి పరుగున వచ్చి కామారెడ్డి లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చాను. ఎముకలు విరిగిపోయాయని, ఆపరేషన్ కు 60 వేలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. తీసుకెళ్లిన 10 వేలు అయిపోవడంతో మళ్లీ డబ్బులు తీసుకుని వస్తామని చెప్పి అమ్మ ను ఇంటికి తీసుకొచ్చిన రెండో రోజు ప్రాణం పోయింది'' అని నర్సవ్వ కూతురు సుగుణ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)