అలిగిన అల్లుడు !

Telugu Lo Computer
0


తెలంగాణలోని మెదక్ లోని గాంధీ నగర్ వీధికి చెందిన శేఖర్ అనే  ఎలక్ట్రిషన్‌ గతంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు.  అయితే తమ పెళ్లయినప్పటికి కూడా తన అత్తగారు కనీసం కట్న కానుకలు, బంగారం కూడా పెట్టలేదని ఏకంగా విద్యుత్‌స్థంభాన్ని ఎక్కాడు. దీంతో స్థానికులు గుర్తించి వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేయగా ప్రాణం దక్కింది. పోలీసులు,ఫైర్ సిబ్బంది సాయంతో శేఖర్‌ను కిందికి దింపి పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమో దు చేశారు. విషయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి ఇరువర్గాల పెద్దలతో మాట్లాడి సమస్యను సద్దుమణిగేలా చేస్తానని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)