మార్చి 3న తన స్నేహితురాలు భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకుని మంచు మనోజ్ ఓ ఇంటివాడయ్యాడు. మంచు లక్ష్మీ తమ్ముడు పెళ్లి బాధ్యతలను పూర్తిగా తన భుజాలపై వేసుకుని అన్ని పనులు దగ్గరుండి చూసుకున్నారు. ఫిల్మ్ నగర్‌లోని ఆమె స్వగృహంలో ఇరువురి కుటుంబసభ్యులు.. అతికొద్ది మంది సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. మంచు మనోజ్‌కు.. మౌనికలకు ఇది రెండో వివాహం అన్ని సంగతి తెలిసిందే. మొదట్లో స్నేహితులుగా ఉన్నారు. అప్పట్లో మౌనిక వివాహానికి మనోజ్ అతిథిగా వెళ్లారు కూడా. మౌనికకు ధైరవ్ రెడ్డి అనే కొడుకు కూడా ఉన్నాడు. పెళ్లి వేడుకలలో ధైరవ్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. ఇక పెళ్లి తర్వాత మనోజ్ చేసిన ఆసక్తికర ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. అందులో మౌనిక చేతులను తన చేతులోకి తీసుకున్నారు మనోజ్. వీరిద్దరి చేతులను ధైరవ్ తన చేతులతో పట్టుకున్నాడు. ఈ అందమైన ఫోటో షేర్ చేస్తూ.. శివుని ఆజ్ఞ అంటూ క్యాప్షన్ ఇచ్చారు మనోజ్.
ఇద్దరి బాధ్యత నాదే !
March 05, 2023
0
Tags