జార్ఖండ్ లోని పాలము ప్రాంతంలో ఏడాది క్రితం జరిగిన హత్య కేసు ఒక నంబర్ చాట్ తో వెలుగులోకి వచ్చింది. పోలీసుల ప్రకారం.. 2022 ఈ ఘటన జరిగింది. గర్వా జిల్లాకు చెందిన అర్జున్ సింగ్ కి ఒక మహిళ నుంచి కాల్ వచ్చింది. రామ్ గఢ్ లోని నవాదిహ్ లో నివాసం ఉంటున్న మన్ దీప్ కోర్వా భార్య సబీనీ దేవీ అతనికి కాల్ చేసింది. అప్పుడు ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త ఎఫైర్ కు దారితీసింది. ఇద్దరు గంటల తరబడి మాట్లాడుకునే వారు. ఈ క్రమంలో అర్జున్ సింగ్ తనను పెళ్లి చేసుకొవాలని, సబీనీ దేవీని కోరాడు. దీనికి ఆమె నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇక సబీనీ ఈ విషయాన్ని తన ఇంట్లో తోడికోడలికి, తన భర్తకు చెప్పింది. ఈ ఘనకార్యం బైటపడితే పరువుపోతుందని ఒక ప్లాన్ వేశారు. అర్జున్ సింగ్ ను మాట్లాడుకుందామని చెప్పి ఊరి బయటకు రప్పించారు. అక్కడ ఫుల్ గా తాగించి, బండరాయితో కొట్టి చంపి బావిలో పడేశారు. అది నిర్మానుష్య ప్రాంతం కావడంతో అక్కడ ఎవరు వెళ్లరు. అయితే.. కొన్ని రోజుల తర్వాత.. దుర్వాసన రావడంతో పోలీసులకు తెలిసింది. అప్పటికే శవం పూర్తిగా ఉబ్బిపోయి గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ఈ క్రమంలో.. వెంటనే పోలీసులు అనాథశవం మాదిరిగా దహాన సంస్కారాలు పూర్తి చేశారు.అర్జున్ సింగ్ తన సోదరుడు కన్పించడం లేదని పోలీసులకు ఫిర్యాదుచేశారు. అయితే.. తాజాగా, అర్జున్ సింగ్ ఫోన్ లో కొన్ని చాట్ లు, ఫోన్ కాల్స్ లను అర్జున్ సింగ్ సోదరుడు గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు ఆమెను అదుపులోనికి తీసుకుని విచారించగా దారుణం బైటపడింది. పెళ్లి చేసుకొమ్మని బలవంతం పెడుతున్నందుకు చంపినట్లు అంగీకరించారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఫోన్ చాట్ తో వెలుగులోకి వచ్చిన హత్య కేసు !
March 05, 2023
0
Tags