ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ మోహిత్ జోషీ శనివారం టెక్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమితులయ్యారు. టెక్ మహీంద్రా ఈ విషయాన్ని శనివారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. డిసెంబరు 19న పదవీ విరమణ చేయబోతున్న సీపీ గుర్నానీ బాధ్యతలను జోషీ చేపడతారని తెలిపింది. మోహిత్ జోషీ టెక్ మహీంద్రాలో చేరుతున్నారని ఈ రెగ్యులేటరీ ఫైలింగ్ తెలిపింది. ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ సాఫ్ట్‌వేర్, కన్సల్టింగ్ స్పేస్‌లో జోషీకి రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉందని తెలిపింది. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ నిర్వహణ, వ్యాపారాల అభివృద్ధి కోసం ప్రపంచంలో అతి పెద్ద కార్పొరేషన్లలో ఆయన పని చేశారని పేర్కొంది. జోషీ ఇన్ఫోసిస్‌కు రాజీనామా చేసిన తర్వాత టెక్ మహీంద్రా ఈ ప్రకటన చేసింది. సీపీ గుర్నానీ ఈ ఏడాది డిసెంబరు 19న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో అంతకుముందే జోషీ తమ కంపెనీలో చేరుతారని, తమ కంపెనీలో పరిస్థితులను అర్థం చేసుకోవడానికి తగిన సమయం ఉండే విధంగా చేరుతారని తెలిపింది. మోహిత్ జోషీ ఆ కంపెనీలో ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్/లైఫ్ సైన్సెస్ బిజినెసెస్‌ను పర్యవేక్షించారు. 2000వ సంవత్సరంలో ఆయన ఇన్ఫోసిస్‌లో చేరారు. అప్పటి నుంచి అనేక రకాల పాత్రలను పోషించారు. ఎడ్గెవెర్వ్ సిస్టమ్స్ లిమిటెడ్ చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. ఇన్ఫోసిస్‌కు చెందిన గ్లోబల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ఫినకిల్ సహా సాఫ్ట్‌వేర్ బిజినెస్‌కు నాయకత్వం వహించారు.
టెక్ మహీంద్రా సీఈవోగా మోహిత్ జోషి
March 11, 2023
0
Tags