ఎయిర్‌ ఏషియా విమానం అత్యవసర ల్యాండింగ్‌ !

Telugu Lo Computer
0


బెంగళూరు నుంచి లక్నోకు వెళ్లేందుకు టేకాఫ్‌ అయిన ఎయిర్‌ ఏషియా విమానాన్ని పది నిమిషాల్లోనే మళ్లీ కెంపెగౌడ అంతర్జాతీయ విమానంలో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. ఈ విషయాన్ని ఎయిర్ ఏషియా అధికారులు ధ్రువీకరించారు. షెడ్యూల ప్రకారం విమానం (I5-2472) విమానం ఉదయం 6.45 గంటలకు లక్నోకు వెళ్లేందుకు టేకాఫ్‌ అయ్యింది. ఆ తర్వాత 9 గంటలకు లక్నోలో ల్యాండ్‌ కావాల్సి ఉంది. టేకాఫ్‌ అయ్యాక కొద్ది నిమిషాల్లోనే విమానంలో సాంకేతిక సమస్య ఎదురైంది. దాంతో పైలెట్లు తిరిగి విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. విమానంలోని ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)